లోక్ సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. కృష్ణా రెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి... బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి పంపించారు. పార్టీలో తగిన గుర్తింపు దక్కకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానం తమను పట్టంచుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తీగల కృష్ణారెడ్డి 1984 నుంచి టీడీపీలో అంచలంచెలుగా ఎదిగారు. మేయర్ గా, హుడా ఛైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత 2014లో మహేశ్వరం ఎమ్మెల్యేగా విజయం సాధించి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు తీగల కృష్ణారెడ్డి.