చంద్రబాబును కలిసిన మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి

చంద్రబాబును కలిసిన  మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి

త్వరలో టీడీపీలో చేరుతానన్నారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.  తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని..త్వరలోనే పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు.  చంద్రబాబుతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు.  అక్టోబర్ 7న ఉదయం తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తీగల టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు.  అయితే తాను మనవరాలి పెళ్లి పత్రిక ఇవ్వడానికే చంద్రబాబుతో భేటీ అయినట్లు  మల్లారెడ్డి చెప్పారు.

Also Read : హెచ్ఎండీఏ చెరువులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

 తీగల కృష్ణారెడ్డి 1983లో రాజకీయాల్లోకి వచ్చారు.  2014లో టీడీపీ తరపున మహేశ్వరం నియోజకవర్గం నుంచి  తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అక్టోబర్ 29న  బీఆర్ఎస్ లో చేరారు.2018లో ఓటమి పాలయ్యారు.   2024 ఫిబ్రవరి 25న  బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఇవాళ చంద్రబాబుతో భేటీ అయిన తీగల టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.