సీఐని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆందోళన

సీఐని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆందోళన

అశ్వారావుపేట, వెలుగు : పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ తీసుకు వెళ్లవద్దు అన్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ కార్యకర్త దాడి చేశారని, పైగా బీఆర్ఎస్ కార్యకర్తపై స్టేషన్ లో పోలీసులు కొట్టారంటూ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇదే విషయమై మంగళవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐ జితేందర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తపై అనవసరంగా దురుసుగా ప్రవర్తిస్తూ కొట్టాడని ఆరోపించారు. వెంకటేశ్వర్లును ఎస్సై శివరామకృష్ణ స్టేషన్​లోకి తీసుకెళ్లి నచ్చజెప్పారు. ఇరు పార్టీల కంప్లైంట్లు తీసుకొని విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.