నార్కట్పల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. శుక్రవారం చిట్యాల మున్సిపల్ కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత వివిధ పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మినర్సింహ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పొకల దేవదాసు, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, నాయకులు శశిపాల్ రెడ్డి, కాటం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.