రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా : సతీశ్ కుమార్​

రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా : సతీశ్ కుమార్​

హుస్నాబాద్, వెలుగు:​ రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని ఓ మంత్రి అహంకారంగా మాట్లాడుతున్నారని, ఎవరు ఎవరిని కొడతారో కొద్దిరోజుల్లోనే తేలుతుందని హుస్నాబాద్​మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్​కుమార్​ అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం దిశానిర్దేశం చేశారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలం వచ్చినా రైతులకు పెట్టుబడిసాయాన్ని అందించని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ​అన్నారు. రాబోయే, ఎంపీ, లోకల్​బాడీ ఎన్నికల్లో ప్రజలు కొట్టే దెబ్బకు మంత్రుల అహంకారం దిగుతుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన పార్టీ బీఆర్​ఎస్ అన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు.