కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ఔదార్యం చాటుకున్నారు. గుడిసెలో నివసిస్తున్న దివ్యాంగుడికి తన సొంత పైసలు రూ.10 లక్షలతో ఇంటిని కట్టించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటకు చెందిన షేక్ఖాదర్ దివ్యాంగుడు. రోడ్డు పక్కన ఉన్న తన స్థలంలో గుడిసెలో ఉండేవారు.
అతడి కష్టాన్ని చూసిన గంప గోవర్ధన్ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చుతో ఇల్లు కట్టించారు. ఆదివారం ఆ ఇంటిని ఆయన ప్రారంభించారు. షేక్ఖాదర్ కుటుంబానికి కొత్త బట్టలు పెట్టి, అక్కడే టీ తాగారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ ముజీబోద్దీన్, ఎంపీపీ ఆంజనేయులు, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ప్రభాకర్రెడ్డి, లీడర్లు గోపిగౌడ్, రవి కుమార్, భాను, రవితేజ పాల్గొన్నారు.