బీఆర్ఎస్​లో చేరిన మాజీ ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, లింగంపేట,  వెలుగు: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత  బి. జనార్ధన్​గౌడ్ శుక్రవారం బీఆర్ఎస్​లో  చేరారు.  హైదరాబాద్​లో  మంత్రి కేటీఆర్​  సమక్షంలో  గులాబీ కండువా కప్పుకున్నారు.   జనార్ధన్​గౌడ్​ ఫస్ట్​ నుంచి కాంగ్రెస్​ పార్టీలో ఉన్నారు.  2008  ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి  గెలిచారు.  2014లో బీఆర్​ఎస్​లో  చేరారు.  2018 ఎన్నికల్లో తిరిగి  కాంగ్రెస్​లో చేరిన జనార్ధన్​గౌడ్​ మళ్లీ గులాబీ గూటికి చేరారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే  జాజాల సురేందర్,  ఎంపీ బీబీపాటిల్ తదితరులు ఉన్నారు.