
- ఆరోగ్య బీమాలో మరిన్ని వ్యాధులను చేర్చాలని వినతి
హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ సమస్యలపై మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కలిశారు. ఆరోగ్య బీమా పథకంలో మరిన్ని వ్యాధులను చేర్చాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో మాజీ మంత్రులు రాజేశం గౌడ్, సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకటరెడ్డి, కోడూరి సత్యనారాయణ గౌడ్, గుజ్జుల రామకృష్ణా రెడ్డి, భద్రయ్య, నగేశ్ తదితరులు ఉన్నారు. తమ వినతికి సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.