మోపాల్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ఆశావర్కర్లకు కాంగ్రెస్అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం శనివారం మోపాల్ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సొర్సింగ్ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధరణి అవలంబిస్తోందని, వారు రోజుల తరబడి ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చి, వారికి న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లీడర్లు ముప్ప గంగారెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు.