
- సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి చుక్కా రామయ్య లేఖ
హైదరాబాద్, వెలుగు : హెల్త్, ఎడ్యుకేషన్ రంగాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కోరారు. రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్కు అవకాశం వచ్చిందని అందులో పేర్కొన్నారు. ‘‘సర్కార్ స్కూళ్లను, హాస్పిటళ్ల ను డెవలప్ చేయాలి. యూనివర్సిటీలకు ఫండ్స్ ఇచ్చి, ఖాళీలను భర్తీ చేయాలి.
కుల వృత్తులను ప్రోత్సహించాలి. రైతుల సమస్య లు పరిష్కరించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను అభివృద్ధి చేయాలి. వెల్ఫేర్ స్కీమ్ల తో పాటు ఐటీపైనా దృష్టి పెట్టాలి. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుంటూ ముందుకెళ్లాలి’’ అని సూచించారు.