వరంగల్​లో నడుస్తున్నది కొండా మురళి సర్కార్​

వరంగల్​లో నడుస్తున్నది కొండా  మురళి సర్కార్​
  • నేను పార్టీ మారితే  రాజీనామా చేసినా..నీకు దమ్ముంటే రిజైన్​ చేసి గెలువు
  • ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫైర్‍

వరంగల్‍, వెలుగు: నేను ఎమ్మెల్సీగా యునానిమస్‍గా గెలిచి కూడా పార్టీ మారడంతో రాజీనామా చేసినా.. నువ్వు పార్టీపరంగా గెలిచి ఆపై ఆ పార్టీ మారినవ్‍. దమ్ముంటే ఆ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలువు’ అంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి..ఎమ్మెల్సీ బస్వరాజ్‍ సారయ్యపై ఫైర్‍ అయ్యారు. వరంగల్‍ పోచమ్మమైదాన్‍ జంక్షన్‍లో ఇటీవల బల్దియా అధికారులు అభివృద్ధి పేరుతో అక్కడున్న డబ్బాలను తొలగించగా,  గురువారం మురళి సదరు బాధితులను కలిసి పరామర్శించారు. 

ఈ సందర్భంగా మురళి..ఎమ్మెల్సీ సారయ్యను ఉద్దేశించి మాట్లాడుతూ ‘బీసీ లీడర్​గా ఉంటూ పేద బీసీలకు అన్యాయం చేస్తవా? అలాంటి పనులు మానుకో. లేదంటే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా’ అని హెచ్చరించారు. వరంగల్​లో కొండా సర్కార్​ నడుస్తోందని..కొండా దంపతులు ఉన్నంతవరకు ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వమన్నారు. 11 మంది బాధితులకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు.