పేదల ఇండ్లకు సౌలతులు కల్పించాలి : మాజీ ఎమ్మెల్సీ ప్రొ. కె నాగేశ్వర్

  • మాజీ ఎమ్మెల్సీ ప్రొ. కె నాగేశ్వర్

ముషీరాబాద్, వెలుగు : గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు తగిన సదుపాయాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు చేపట్టిన ధర్నాకు ఆయన మద్దతు పలికారు.

కనీస మౌలిక వసతులు కల్పించకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ఇండ్లను కేటాయించిందన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, బడ్జెట్​లో నిధుల కేటాయింపు చేయాలని కోరారు.