- సీఎం రేవంత్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్సీలు
నల్గొండ అర్బన్, వెలుగు : పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యల పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్ రెడ్డి, పూల రవీందర్, పీఆర్‌టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి..సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా టీచర్ల పదోన్నతులు, బదిలీలు
317 జీవో బాధితుల సమస్యలతో పాటు పెండింగ్ బిల్లుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్కూళ్లకు ఉచిత కరెంట్ ఇస్తామని, పారిశుధ్య కార్మికులను నియమిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని గుర్తుచేశారు. సమస్యలన్నీ విన్న సీఎం సానుకూలంగా స్పందించినట్లు పూల రవీందర్ తెలిపారు.