నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఇవాళ ఈడీ ముందుకు హాజరయ్యారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50 ఏ ప్రకారం ఆయనను ఈడీ ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. గత నెల 3వ తేదీనే అంజన్ కుమార్ యాదవ్ విచారణకు రావాల్సి ఉండగా.... అనారోగ్యం కారణంగా ఆయన హాజరు కాలేదు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాలు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ నేపథ్యంలో ఈడీ ఈ కేసుపై దర్యాప్తు చేపట్టింది. జూన్‌లో వరుసగా మూడు రోజుల పాటు దేశ రాజధానిలో జరిగిన విచారణకు సోనియా హాజరయ్యారు. వాటన్నింటికీ ఆమె సంతృప్తికరమైన వివరణలు ఇచ్చారని అప్పట్లో ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో 70కి పైగా ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించారని, వాటన్నింటికీ ఆమె సరైన సమాధానం ఇచ్చారని స్పష్టం చేశాయి.