గంగాధర, వెలుగు: కాంగ్రెస్ పార్టీ వారంటీ లేని గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను ఆగం చేసిందని, కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేశారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారన్నారు.
శనివారం గంగాధర మండలం మధురానగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో చొప్పదండి నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవిశంకర్, కె.విద్యాసాగర్‌రావు, పార్టీ నేత గెల్లు శ్రీనివాస్యాదవ్హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్7 వేల స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తే సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామంటున్నారని మండిపడ్డారు.
ఫిబ్రవరి నెలాఖరుకల్లా 2 లక్షల ఉద్యోగ ఖాళీల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి బండి సంజయ్ నయాపైసా తీసుకురాలేదని దుయ్యబట్టారు.