మునుగోడు నేతలపై టీఆర్ఎస్ ఫోకస్

మునుగోడు సెగ్మెంట్ నేతలపై టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మాజీ ఎంపీ బూర నర్సయ్య రాజీనామాతో టీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. ఉద్యమకారుడు పార్టీని వీడటంపై ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. కేవలం పార్టీ ముఖ్యనేతల నిర్లక్ష్యంతోనే బూర దూరమయ్యారనే చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్న టెన్షన్ కనిపిస్తోంది. అయితే బైపోల్ లో టీఆర్ఎస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంచనాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్యతో పాటు పోయేవారిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసీఆర్ కు లేఖ కూడా పంపారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానంపై లేఖలో ప్రస్తవించారు. 2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని బూర  నర్సయ్య లేఖలో పేర్కొన్నారు. పైరవీలు చేసే వ్యక్తిని కాదని తెలిసినా మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.