మాజీ ఎంపీ దామోదర్ రెడ్డిమృతి బాధాకరం : గుత్తా సుఖేందర్ రెడ్డి

  •     శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 

దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి(85) సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రెడ్డి, ఎమ్మెల్యే బాలూనాయక్, సీపీఐ నాయకుడు పల్లా వెంకట్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ సంతోష్ నగర్ లోని వారి స్వగృహానికి వెళ్లి దామోదర్ రెడ్డి (85) పార్థివదేహానికి నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ దామోదర్​రెడ్డి మృతి బాధాకరమన్నారు. దేవరకొండ మార్కెట్ చైర్మన్ గా, సిల్వర్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడిగా, నల్గొండ ఎంపీగా 1979లో ఆయన గెలిచి జిల్లా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. వారి వెంట దేవరకొండ మున్సిపల్ చైర్మన్ నరసింహ, ఎంపీపీ జానీయాదవ్, కొండమల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, కోతి యుగంధర్ రెడ్డి, వడ్త్యా దేవేందర్ నాయక్, నాయకులు ఉన్నారు.