తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే

నార్కట్​పల్లి, వెలుగు : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శేపూరి రవీందర్ నియామకం పట్ల సహకరించిన ఆయనను మంగళవారం హైదరాబాదులో కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

 ప్రధాని మోడీ తొమ్మిదేండ్ల అందించిన పథకాల గురించి ప్రచారం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లపు బుద్ధుడు, చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, బూత్ కమిటీ అధ్యక్షుడు రావుల వెంకన్న, యువజన నాయకులు మర్రి హరీశ్​రెడ్డి, పాకాల దినేశ్, అమరోజు సందీప్ పాల్గొన్నారు.