కాంగ్రెస్ లో చేరిన వివేక్, కుమారుడు వంశీకృష్ణతో కలిసి పార్టీలో జాయిన్

కాంగ్రెస్ లో చేరిన వివేక్, కుమారుడు వంశీకృష్ణతో కలిసి పార్టీలో జాయిన్
  • కాంగ్రెస్ లో చేరిన వివేక్
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ
  • ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో చేరిక
  • కుమారుడు వంశీకృష్ణతో కలిసి పార్టీలో జాయిన్
  • నోవాటెల్ లో రాహుల్ తో వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ భేటీ
  • ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆహ్వానం మేరకు డెసిషన్
  • దేశానికి గాంధీ ఫ్యామిలీ.. తెలంగాణకు కాకా ఫ్యామిలీ అవసరం
  • వివేక్ ఫ్యామిలీ చేరికతో కాంగ్రెస్ కు వెయ్యి ఏనుగుల బలం
  • కాంగ్రెస్ పార్టీతో కాకా కుటుంబానికి మూడు తరాల బంధం
  • నేను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివేక్ ను కలిసి రిక్వెస్ట్ చేశాం
  • వివేక్ ను సాదరంగా ఆహ్వానించాం: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 
  • కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తాం
  • తెలంగాణ సాధనలో అప్పటి ఎంపీలు కీలక పాత్ర వహించారు
  • కాంగ్రెస్ లో చేరిన అనంతరం మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యడు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఇవాళ శంషాబాద్ నోవాటెల్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వివేక్ వెంకటస్వామికి, ఆయన కుమారుడు వంశీకృష్ణకు కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. అలనాడు తెలంగాణ కోసం కొట్లాడిన వివేక్ వెంకటస్వామిని పార్టీలో చేరాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆహ్వనించ చడంతో ఆయన పార్టీ మారారని తెలిసింది. 

ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో నోవాటెల్ కు చేరుకున్న వివేక్ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ తో భేటీ అయ్యారు. అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడడుతూ.. కాకా కుటుంబానికి గాంధీ ఫ్యామిలీతో మూడు తరాల అనుబంధం ఉన్నదన్నారు. వివేక్ వెంకటస్వామి చేరిక తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని చెప్పారు. తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పలు మార్లు వివేక్ వెంకటస్వామిని కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించామని చెప్పారు.

ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ఎంపీల బృందం తిరిగి కాంగ్రెస్ లో చేరడం శుభసూచికమని, తెలంగాణలో అధికార మార్పిడి జరుగబోతోందని పునరుద్ఘాటించారు. తెలంగాణలో కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనకు వివేక్ చేరిక బలాన్ని ఇస్తుందన్నారు. దేశానికి గాంధీ కుటుంబం ఎంత ముఖ్యమో.. తెలంగాణకు కాకా కుటుంబం అంతే ముఖ్యమని రేవంత్ రెడ్డి అన్నారు. వివేక్ వెంకట స్వామి చేరిక వల్ల తెలంగాణలోని నాలుగు కోట్ల మందికి మేలుజరుగుతుందన్నారు.

రాక్షస పాలన అంతమే లక్ష్యం

తెలంగాణలో కేసీఆర్ కుటుంబ రాక్షస పాలన అంతమొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చెప్పారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో అప్పటి ఎంపీల పాత్ర ఎంతో కీలకమన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చిందని చెప్పారు.

తెలంగాణలో గద్దెనెక్కిన బీఆర్ఎస్ పార్టీ .. కేసీఆర్ కుటుంబ లబ్ధి కోసమే పనిచేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందని, అందుకే తామంతా కలిసి రాక్షస పాలన అంతానికి కృషి చేస్తామని చెప్పారు. తమ భవిష్యత్ కార్యాచరణను పార్టీ నిర్ణయిస్తుందని వివేక్ స్పష్టం చేశారు.

ALSO READ :- బీజేపీకి రాజీనామా చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి