మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట

 మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట

ఆరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.  అవినీతి కేసులో ఆమెకు సీబీఐ కోర్టు గతంలో ఐదేళ్ల శిక్ష విధించగా ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సీబీఐ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి అనుమతించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి రుణం పొందారనే కేసులో సీబీఐ కోర్టు గీత, ఆమె భర్తతో పాటు మరో ఇద్దరికి 2022లో ఐదేళ్ల శిక్ష విధించింది. కాగా  కొత్తపల్లి గీత అరకు నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు.  ప్రస్తుతం ఈమె బీజేపీలో ఉన్నారు.