మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. తమ పార్టీ(బీజేపీ) అధికారంలోకి వచ్చేదని అన్నారు. బండి సంజయ్ ని మార్చిన తర్వాతే తమ నుంచి ప్రజలు కాంగ్రెస్ వైపు మల్లారని తెలిపారు. ప్రజలకు మార్పు కోరుకున్నారని.. బీఆర్ఎస్ మాకొద్దని ప్రజలు ముందే డిసైడ్ అయ్యారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన సాగించ లేదని.. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చతికిల పడిందని వివరించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేరని.. వారికి కేంద్ర ప్రభుత్వ అండ లేదని చెప్పారు. అయినా రేవంత్ రెడ్డి.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంచి పాలన అందించాలని కోరారు. మరో 30 ఏళ్లు దేశంలో బీజేపీ పాలనే ఉంటుందని.. దీనికి నిదర్శనం.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయమేనని.. వచ్చే ఎన్నికల్లో బంఫర్ మెజారిటీతో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తాను, తన కొడుకు మిథున్ మహబూబ్ నగర్ ప్రజల సేవలోనే ఉంటామని జితేందర్ తెలిపారు.