10 ఏండ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మల్లు రవి

కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేసింది.. కానీ ప్రతిపక్ష పార్టీలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎంపీ మల్లు రవి. పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలను గెలవాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులంతా కలసి పని చేస్తున్నారని అన్నారు. 10 ఏండ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకుపోతుందని చెప్పారు మల్లు రవి. 

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్, కేటీఆర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడుతుంది కాబట్టి.. అసెంబ్లీ ఎన్నికలకంటే రెట్టింపు మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

ALSO READ :- మావాడికి ఖరీదైన కార్లు లేవు..ఆస్తులు లేవు: యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ పేరెంట్స్

 
ధరణి సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి.. సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దేశ ప్రజలంతా తెలంగాణ లాంటి మోడల్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలిచి సెక్యూలర్, డెమోక్రసీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు.