పంజాగుట్ట/అలంపూర్, వెలుగు: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. రెండు రోజుల కింద హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం హార్ట్, కిడ్నీ, లంగ్స్ ఇన్ఫెక్షన్కారణంగా ఆర్ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గురువారం పలువురు ప్రముఖలు ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ రాములు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, గద్వాల్ మాజీ జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. మందా జగన్నాథం గతంలో టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లో పనిచేశారు. పస్తుతం బీఎస్పీలో ఉన్నారు.