మాజీ ఎంపీ పొంగులేటి పార్టీ మార్పుపై ఆచితూచి..

ఖమ్మం, వెలుగు: బీఆర్ఎస్​ హైకమాండ్, ప్రభుత్వ హామీలపై మాటల తీవ్రత పెంచిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి.. పార్టీ మార్పుపై మాత్రం తొందరపడడం లేదు.  కొత్త సంవత్సరం రోజున పార్టీకి వ్యతిరేకంగా మొదటిసారి గొంతెత్తిన ఆయన.. ఆ తర్వాత క్రమంగా మాటల దాడి పెంచుతున్నారు.  పార్టీ అధినేత, సీఎం కేసీఆర్​, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తనకు ఇచ్చిన మాట నెరవేర్చకుండా ఇన్నేళ్లు మోసం చేశారని బాహటంగానే చెబుతున్నారు. అయినా ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేలా పొంగులేటి ఉన్నట్టు కనిపించడం లేదు. స్లో అండ్​ స్టడీగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇలా మార్చి నెలాఖరు వరకు సాగదీయాలన్న ప్లాన్​ లో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. దీని వెనుక పెద్ద స్కెచ్​ ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వచ్చే వరకు వేచిచూడాలని పొంగులేటి భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఆత్మీయ సమావేశాలతో ప్రజల్లోకి..

ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని పినపాక, ఇల్లందు, మధిర నియోజకవర్గాల్లో తన అభిమానులు, కార్యకర్తలతో పొంగులేటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా తాను బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడిన ఇబ్బందులు, పార్టీ మారాల్సిన పరిస్థితులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే అంశంపై చర్చ జరిగేలా ప్లాన్​ చేస్తున్నారు. తద్వారా ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో పార్టీ ముఖ్యనేతలపై ఎటాక్​ చేస్తుండడం, దానికి బీఆర్ఎస్​ నేతల కౌంటర్లతో ఇప్పటికే పొంగులేటి ప్లాన్ వర్కవుట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ చర్యలపై పార్టీ స్పందించి ఏదైనా యాక్షన్​ తీసుకుంటే అది కూడా తనకు కలిసి వస్తుందనే ఆలోచనలో పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మిగతా ఏడు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు పెట్టాల్సి ఉంది.  వారానికొకటి చొప్పున ఈ సమావేశాలు ఏర్పాటుచేసినా కనీసం మార్చి రెండో వారం వరకు పూర్తవుతాయి. 

పక్క జిల్లాలపైనా ఫోకస్​

ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితమైన పొంగులేటి, ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాపైనా ఫోకస్​ పెట్టినట్టు తెలుస్తోంది. అక్కడ కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్​ చేసినా ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలను నిలిపివేశారు. గతేడాది పొంగులేటి కుమార్తె పెళ్లితో కుదిరిన బంధుత్వాలు, ఆ జిల్లాలో రాజకీయ నేపథ్యమున్న ఫ్యామిలీతో వియ్యం కలవడంతో అక్కడ కూడా తనతో కలిసి వచ్చే వారితో సమన్వయం చేసుకోవాలని భావించారు. అయితే ప్రస్తుతానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే తన వర్గాన్ని బలోపేతం చేసుకోవాలని పొంగులేటి ప్లాన్​ చేస్తున్నారు.

మూడు పార్టీల నుంచి ఆహ్వానాలు

పొంగులేటికి ప్రస్తుతం కాంగ్రెస్​, బీజేపీ, వైఎస్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీల నుంచి ఆహ్వానాలున్నాయి. ఆ పార్టీల ముఖ్యనేతలు స్వయంగా పొంగులేటితో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఆయన మాత్రం ఏమీ తేల్చడం లేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్​ఎంపీగా ఉన్నా రూలింగ్​ పార్టీ టికెట్​ ఇవ్వలేదు. అప్పుడే తమ పార్టీల నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్​, బీజేపీ లీడర్లు టికెట్​ఆఫర్​చేశారు. అప్పటినుంచి ఆయా పార్టీలతో అదే గ్యాప్​ మెయింటెయిన్​ చేస్తున్నారు. ఇప్పటికే ఏ పార్టీలోకి వెళ్లాలనేది పొంగులేటి నిర్ణయం తీసుకున్నారని, దానికి తగిన విధంగా కార్యకర్తలను, అభిమానులను కన్విన్స్​ చేయడం కోసమే ఇంకా తుది నిర్ణయం ప్రకటించడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కోరినన్ని టికెట్లు ఇస్తామని, అధికారంలోకి వస్తే కీలక పదవులు కట్టబెడతామంటూ వివిధ పార్టీలు హామీలు కూడా ఇస్తున్నాయని తెలుస్తోంది.