పార్టీ మారాల్సి వస్తే ఖమ్మం నడిబొడ్డున కండువా కప్పుకుంటా

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి 

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : తాను పార్టీ మారాల్సి వస్తే ఖమ్మం నడిబొడ్డున లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో కండువా కప్పుకుంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లో పర్యటించి ఇటీవల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను, అనారోగ్యానికి గురైన వారిని పరామర్శించారు. అన్నపురెడ్డిపల్లిలో కార్యకర్తలు ‘సార్​ మీరు పార్టీ మారుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నయ్’ అని అనగానే పై విధంగా స్పందించారు. ‘నేను పార్టీ మారితే నాతో పాటు నా కార్యకర్తలంతా కండువాలు కప్పుకునేలా చేస్తా’ అని అన్నారు. సర్పంచ్ పద్మ, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్​కృష్ణారెడ్డి, జిల్లా లీడర్లు జారె ఆదినారాయణ, మువ్వా విజయబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.