రైతులు ఏడుస్తుంటే సంబరాల్లో ప్రభుత్వం: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

తిమ్మాపూర్, వెలుగు: అకాల వర్షాలతో కొనుగోలు సెంటర్లలో  వడ్లు తడిసి రైతులు ఏడుస్తుంటే.. కేసీఆర్​ ప్రభుత్వం సంబరాల్లో మునిగి తేలుతోందని మాజీ ఎంపీ  పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.  ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కొనుగోలు సెంటర్లలో రైతుల వడ్లు తడిసిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోమవారం తిమ్మాపూర్​ మండలం పర్లపల్లి గ్రామంలోని కొనుగోలు సెంటర్ ‌‌ ‌‌లో పొన్నం ప్రభాకర్​ రైతులతో మాట్లాడారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు వడ్లను సెంటర్లకు తీసుకొచ్చి 25 రోజులు అవుతున్నా వాటిని కొనకుండా బీఆర్ఎస్ లీడర్లు ఆత్మీయ సమ్మేళనాలు, ఆవిర్భావ వేడుకలు, సెక్రటేరియట్ ప్రారంభోత్సవాలలో మునిగిపోయారన్నారు. జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఉత్సవాల జోష్ నుంచి కోలుకొని రైతుల బాధలు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కె.సత్యనారాయణ,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.ఎల్ గౌడ్, లీడర్లు తదితరులు పాల్గొన్నారు.