
హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్ నుంచి ప్రచారం చేస్తే బీఆర్ఎస్ గెలుస్తుందని నమ్ముతున్న సీఎం కేసీఆర్ పదేండ్లుగా ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. శనివారం ఆయన హుస్నాబాద్లోమీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో కేసీఆర్ కుర్చేసుకొని కూర్చొని గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన మాటల ప్రకారం.. ముఖ్యమంత్రికి కుర్చీ సిద్ధం చేసి నిరసన వ్యక్తంచేశారు.
ఇక్కడి ఎమ్మెల్యే దద్దమ్మతనంతో ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకల వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆమెది ఆత్మహత్య కాదని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. బీఆర్ఎస్ ఇంటింటికీ బంగారాన్ని పంచినా ఆ పార్టీ గెలవబోదన్నారు.