- డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుపై కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపీ
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని నివాసంలో మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ సంఘాల నేతలు కలిశారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపి, శాలువా కప్పి సన్మానించారు. ఇక అంతకు ముందు బీసీ సంఘాల నేతలు సెక్రటేరియెట్ లో మంత్రి శ్రీధర్ బాబు చాంబర్ లో సమావేశమయ్యారు. కులగణనపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు.