నల్ల నర్సింహులు సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు

హైదరాబాద్: రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్ల నర్సింహులు జయంతిని అధికారికంగా నిర్వహించాలని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బలహీన వర్గాల నుంచి వచ్చి సాయుధ పోరాటాన్ని నడిపిన గొప్ప నాయకుడు నల్ల నర్సింహులు అని కొనియాడారు. ఆయన సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఆనంద భాస్కర్ ఆరోపించారు. నిజాం రజాకార్లతో ఆయన చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తించాలని, అక్టోబర్ 2న ఆయన జయంతిని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.