జనగామ, వెలుగు: ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు పై బీజేపీ లీడర్లు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని మాజీ ఎంపీ రవీందర్ నాయక్ అన్నారు. ఆదివారం ఆయన జనగామలోని డీసీసీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలుంటాయని చెప్పిన బీజేపీ అప్పుడూ, ఇప్పుడూ కేంద్రంలో అధికారంలో ఉందన్నారు.
అయినా కేసీఆర్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం తగదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని కోరారు. సమావేశంలో జనగామ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, బడికె ఇందిర, శ్రీనివాస్, దాసరి క్రాంతి, మహేశ్తదితరులు పాల్గొన్నారు.