
- మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజల నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ అన్నారు. రాష్ట్రానికి మేలు చేస్తారని, అభివృద్ధికి దోహదపడ్తారని బీజేపీకి చెందిన 8మంది ఎంపీలను గెలిపిస్తే.. ఒరిగిందేమీ లేదన్నారు. ఇక రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా.. తెలంగాణకు వారు తెచ్చింది గుండు సున్నా అని విమర్శించారు.
గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ చేతిలో అన్ని రకాలుగా చితికిపోయిన తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి గాడిన పెడుతున్నారని చెప్పారు. అరు గ్యారంటీలను అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా.. ఉన్న వనరులతోనే రాష్ట్రాభివృద్ధికి సీఎం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.