- మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
ఖైరతాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్‌పాలనలో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ ఫార్ములా రేస్ కేసీఆర్‌కు తెలియకుండా జరిగింది కాదన్నారు.
కృష్టా, గోదావరి పుష్కరాల పేరుతో రూ.12 వందల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన రూ.80 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అసైన్డ్‌ల్యాండ్స్, నయీం నుంచి తీసుకున్న 2 వేల ఎకరాలు, డబ్బు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.