తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. కమిషన్ సభ్యులుగా ఎం.రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్ ను నియమిస్తూ.. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఛైర్మన్ తో పాటు సభ్యులు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటికే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ను ప్రభుత్వం నియమించింది.