హైదరాబాద్,వెలుగు: బంజారాలకు స్టేట్ కేబినెట్లో ఎందుకు చోటు కల్పించలే దని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.
శవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలుస్తున్న బంజారాలు రాజ్యాంగ ఫలాలకు దూరమవుతున్నారన్నారు. మైథిలీ, కొంకణి, కోడ భాష మాట్లాడే కోటి మందిని 8వ షెడ్యూల్డ్ లో చేర్చాలని డిమాండ్ చేశా రు.12 కోట్ల మంది మాట్లాడే బంజారా భాషని 8వ షెడ్యూల్డ్ లో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా, పట్టించుకోవ డంలేదని పేర్కొన్నారు.
ధాని మోదీ బంజారాల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంటే.. కాంగ్రెస్ సర్కారు సేవాలాల్ మహరాజ్ విగ్రహాలను కూడా పెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో బంజారాల తరఫున మోదీకి సహకరిస్తామని, బీజేపీ సభ్యత్వాలను నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. గాలిలో దీపంలా కొట్లాడుతున్న బంజారా జాతిని గుర్తించిన మోదీకి సీతారాం నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.