హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల బీజేపీ మీటింగ్ లు మంగళ, బుధ వారాల్లో జరగనున్నాయి. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగనున్న మీటింగ్ కు మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొంటారని పార్టీ సోమవారం ప్రకటనలో తెలిపింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం జరిగే బీజేపీ సమావేశానికి పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, ఎంపీ అర్వింద్, ఇతర నాయకులు అటెండ్కానున్నారు. బుధవారం జరిగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, ఎంపీ సోయం బాపూరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి
పాల్గొంటారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.