సీఎం కేసీఆర్ 35 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసిన్రు: వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇటు ఉద్యోగాలు.. అటు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా దగా చేసిండని ఫైర్ అయ్యారు. ఎన్నికలు రాగానే మళ్లీ నిరుద్యోగులకు ఆశలు చూపి ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో మరోసారి మోసం చేసే కుట్రకు తెరలేపారని ధ్వజమెత్తారు. 

ALSO READ: ఎలక్షన్​ సీజన్​..పెండింగ్​ పనులన్నీ ఫటాఫట్​..

మోసకారి కేసీఆర్ మాటలను, హామీలను నమ్మవద్దని కోరారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇస్తానంటే నిరుద్యోగులు మోసపోయేందుకు సిద్ధంగా లేరని వివేక్ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేంద్రంలో మాదిరిగానే రాష్ట్రంలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తుందని భరోసా ఇచ్చారు. నిరుద్యోగులు ఈసారి బీజేపీని గెలిపించాలని కోరారు.