125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి: వివేక్

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి: వివేక్

హైదరాబాద్ : అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం నిరసనలు తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పంజాగుట్టలో మాల నేతలను అరెస్ట్ ను ఖండించారు. అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నించారు వివేక్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో దళితులు కీలకపాత్ర  పోషించారని చెప్పారు.