నెక్కొండ, వెలుగు : తెలంగాణలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే డెవలప్ చేసి చూపిస్తామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నెక్కొండ అంబేద్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ డబుల్ ఇండ్లు ఇస్తామని చెప్పిన బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయినా నర్సంపేటలో ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదన్నారు.
బీసీ, మైనార్టీ, దళిత, గిరిజన బంధు పేరిట మాయమాటలు చెబుతూ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఇండ్లు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, లీడర్లు సొంటిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, మల్లిక్, అనిల్, గోపాల్, ప్రసాద్ పాల్గొన్నారు.