కార్గిల్ యుద్ధ వీరుడు.. నేవీ మాజీ చీఫ్ సుషీల్ కుమార్ కన్నుమూత

కార్గిల్ యుద్ధ వీరుడు.. నేవీ మాజీ చీఫ్ సుషీల్ కుమార్ కన్నుమూత

మాజీ నావికా దళ పతి సుషీల్ కుమార్(79) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం పొద్దున ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ రిఫెరల్ హాస్పిటల్ లో కన్నుమూశారు.  సుషీల్ 1998-2000ల మధ్యకాలంలో నేవీ దళ పతిగా తన సేవలను అంధించారు. కార్గిల్ యుధ్ధంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆర్మీనుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. ‘A Prime Minister to Remember Memories of a Military Chief’ అనే పుస్తకాన్ని రాశారు.  కార్గిల్ సమయంలో అప్పటి ప్రధాన మంత్రి, దివంగత నేత వాజ్ పేయ్ తో తనకు జరిగిన చర్చను ఆ పుస్తకంలో ప్రధానంగా చర్చించారు.