న్యూ ఇండియా బ్యాంక్ మాజీ సీఈఓ అరెస్టు

న్యూ ఇండియా బ్యాంక్ మాజీ సీఈఓ అరెస్టు

ముంబై:  న్యూ ఇండియా కో–ఆపరేటివ్ బ్యాంక్ మాజీ సీఈఓ అభిమన్యు భోన్‌ను గురువారం రాత్రి ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ బ్యాంకులో కోట్లాది రూపాయల కుంభకోణం జరగడం తెలిసిందే. ఇతడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని, 2019,  2024 మధ్యకాలంలో నిధుల దుర్వినియోగం జరిగినప్పుడు సీఈఓగా పనిచేశాడని పోలీసులు తెలిపారు.  బ్యాంకు నుంచి రూ. 122 కోట్లు గోల్​మాల్​గా కాగా, వాటిని సుమారు రూ. కోటి తీసుకున్నాడని ప్రకటించారు.

నిందితులకు కోర్టు ఈనెల 28 వరకు పోలీసు కస్టడీకి పంపించింది. ఇదే కేసులో ప్రధాన నిందితుడు హితేష్ మెహతా పోలీసు రిమాండ్‌ను కోర్టు ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. బ్యాంక్ జనరల్ మేనేజర్  అకౌంట్స్ హెడ్ అయిన మెహతా బ్యాంకు సేఫ్ నుండి రూ.122 కోట్లను దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు నుండి దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టర్​ ధర్మేష్ పౌన్ తో పాటు ఆయనను అరెస్టు చేశారు.