బెంగళూరు: టీమిండియా మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్ (52) మృతి చెందాడు. తాను నివసిస్తున్న అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి కిందపడి మరణించినట్లు తెలిసింది. అయితే ఇందులో ఆత్మహత్యా కోణం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేపట్టారు. జాన్సన్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గత వారం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో సెయింట్ ఫిలోమినా హాస్పిటల్లో చేరిన జాన్సన్.. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. ఇండియా తరఫున రెండు టెస్ట్లు ఆడిన జాన్సన్ 125 ఫస్ట్ క్లాస్ వికెట్స్ తీశాడు. అలాగే లిస్ట్–ఎ మ్యాచ్ల్లో 33 వికెట్లు పడగొట్టాడు.