పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు డానిష్ కనేరియా, షాహిద్ అఫ్రిది వివాదంలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. తాను జట్టులో ఉన్న సమయంలో ఆఫ్రిది వల్ల తాను పడ్డ ఇబ్బందుల గురుంచి బయట ప్రపంచానికి తెలిసేలా కనేరియా వివిధ వార్తా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఆఫ్రిది తన సొంత కూతురి పట్ల చూపిన ఒక దారుణ ఇన్సిడెంట్‌ని కనేరియా బయటపెట్టాడు.
"తన కుమార్తె హిందూ దేవునికి పూజిస్తోందన్న కోపంతో షాహిద్ అఫ్రిది టీవీని పగలగొట్టాడు. అతడు తన అమాయకపు కుమార్తెతోనే అలా ప్రవర్తించాడంటే.. నాతో ఎలా ప్రవర్తించేవాడో ఊహించుకోండి.." అని కనేరియా తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్ట్ చెందాడు. ఆ ఘటనను అఫ్రిది అంగీకరించిన వీడియోను కూడా అతడు పోస్ట్ చేశాడు.
Shahid Afridi broke TV because his daughter was performing Pooja.
— Danish Kaneria (@DanishKaneria61) October 27, 2023
Just imagine if he could do this to her innocent daughter, how would he have treated me. https://t.co/bcjy6LqnoA
అవును పగలకొట్టా: అఫ్రిది
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఫ్రిదిని హోస్ట్ అదే ప్రశ్న అడగ్గా.. అతడు అవును అని సమాధానమిచ్చాడు. అతడు టీవీ పగలకొట్టిన ఘటనను వివరిస్తూ.. "ఇంతకుముందు తాను స్టార్ ప్లస్ డ్రామాలు ఎక్కువగా చూసేవాడినని. నాతో కలిసి నా భార్య కూడా చూసేది. ఒకవేళ తాను ఇవి చూడాలనుకుంటే ఒంటరిగా చూడమనేవాడిని. పిల్లలను మీతో కూర్చోబెట్టకండి అని చెప్పేవాడిని. కానీ అక్ష లేదా అన్షా (అతని కుమార్తెలు) ఎప్పుడో ఆ దృశ్యాలు చేశారు."
"ఒకరోజు తాను ఇంటికి వచ్చిన సమయంలో అతని కుమార్తెల్లో ఒకరు టీవీ ముందు చేతులు ఊపుతూ యున్-యున్(హిందూ సంప్రదాయాల్లో దేవునికి ఆర్తి పట్టడం) చేస్తూ స్టార్ ప్లస్ టీవీలో ఆడుతున్నారు. హిందూ సంప్రదాయం పాటిస్తున్న తనను(కుమార్తె) చూసి నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే టీవీని మోచేతితో కొట్టి పగలగొట్టాను.." అని అఫ్రిదీ అంగీకరించాడు. అతడు చెప్పిన ఈ సమాధానానికి హోస్ట్ సహా అక్కడ కూర్చున్న కొందరు పాకిస్తాన్ ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు.
This is reality of secularism in Pakistan, TVs are broken for showing Hindu rituals & people applaud it pic.twitter.com/PXKcs5wcyf
— Amit Kumar (@AMIT_GUJJU) December 28, 2019
పాకిస్తాన్ జట్టుకు ఆడిన తొలి హిందువు అనిల్ దళ్‌పత్ కాగా, రెండో హిందువు డానిష్ కనేరియా. పాక్ తరఫున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన కనేరియా, మొత్తంగా 276 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2012లో అతనిపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం.. అవి నిజమేనని అతడు అంగీకరించడంతో క్రికెట్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడింది.
ALSO READ : Cricket World Cup 2023: తొలి మ్యాచ్‌లోనే రోహిత్ రికార్డ్ బ్రేక్.. ఆస్ట్రేలియా ఓపెనర్ అరుదైన ఘనత