Billy Ibadulla: టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ.. కన్నుమూసిన మాజీ ఆల్‌రౌండర్

Billy Ibadulla: టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ.. కన్నుమూసిన మాజీ ఆల్‌రౌండర్

పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ బిల్లీ ఇబాదుల్లా కన్నుమూశారు. 88 సంవత్సరాల వయస్సులో ఆయన తుదిశ్వాస విడిచారు. 1964- 1967 మధ్య నాలుగు టెస్టులు ఆడిన ఇబాదుల్లా.. టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేసిన మొదటి పాకిస్తాన్ బ్యాటర్. 

కరాచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఈ మాజీ క్రికెటర్ 166 పరుగులు చేశాడు. తోటి అరంగేట్ర ఆటగాడు, వికెట్ కీపర్ అబ్దుల్ ఖాదిర్‌తో కలిసి 249 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ఈ ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్లు నెలకొల్పిన భాగస్వామ్యమే అత్యధికం. ఈ పాక్ మాజీ ఆల్‌రౌండర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మరింత రాణించాడు. 17,078 పరుగులు చేయడంతో పాటు 462 వికెట్లు పడగొట్టాడు. 

ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో ఇబాదుల్లాతో కలిసి ఆడిన వార్విక్‌షైర్ ప్రెసిడెంట్ డెన్నిస్ అమిస్ తన మాజీ సహచరుడికి నివాళులర్పిస్తూ ఒక భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు. ఇబాదుల్లా ఒక ప్రత్యేక క్రికెటర్, గొప్ప వారిలో ఒకడు, అతనితో గడిపే క్షణాలు చాలా సరదాగా ఉండేవి.. అని డెన్నిస్ వెల్లడించారు. ఈ మాజీ మాజీ న్యూజిలాండ్‌ దేశవాళీ జట్టు ఒటాగో తరుపున కొన్ని సీజన్లు ఆడాడు.