స్పాట్ ఫిక్సింగ్.. క్రికెటర్‌కు 17నెలల జైలు శిక్ష

స్పాట్ ఫిక్సింగ్.. క్రికెటర్‌కు 17నెలల జైలు శిక్ష

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ ఆదాయం కోసం అడ్డదార్లు తొక్కాడు. అడ్డదార్లతో పరువు పోవడంతో ఇంగ్లాండ్‌లో పౌరసత్వం తీసుకున్నాడు. అక్కడా తీరు మారలేదు. కౌంటీల్లో క్రికెట్ ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. స్పాట్ ఫిక్సింగ్‌లో నేరం నిరూపణై  జైలుపాలయ్యాడు.

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ నాసిర్ జంషెడ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. 2008 పాక్ అంతర్జాతీయ జట్టులోకి అరంగ్రేటం చేసిన ఈ బ్యాట్స్ మెన్ 48 వన్డేల్లో 3సెంచరీలు,8 హాఫ్ సెంచరీలు చేశాడు. 2015లో ఆదాయం కోసం పాక్ క్రికెట్ కు దూరమై ఇంగ్లాండ లో సెటిల్ అయ్యాడు. ఓ వైపు ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడుతూ 2016 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (పీబీఎల్) టీ20లో తొలి 2బాళ్లకు రన్స్ చేయకుండా, 2019లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ )లో బ్రిటన్ కు చెందిన అన్వర్, ఇజాత్‌లో కలిసి పాక్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడేలా ప్రేరేపించినట్లు ఆరోపణలు వచ్చాయి. లీగ్ లో పాక్ బ్యాట్స్ మెన్ షార్జీల్ రెండు బంతులకు పరుగులు చేయకుండా ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు.

అయితే స్పాట్ ఫిక్సింగ్ జరుగుతున్నట్లు అనుమానం రావడంతో నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా జంషడ్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా బుకీ మార్క్, యూసఫ్ అన్వర్, మహ్మద్ ఇజాజ్‌ తో కలిసి లీగుల్లో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దీంతో మాంచెస్టర్ క్రౌన్ కోర్టు అతనికి 17నెలల జైలు శిక్ష విధించింది.

మరిన్ని వార్తలు

అలుగుతో కరోనా వైరస్ వ్యాప్తి!

చీర బాలేదని ప్రేమపెళ్లి రద్దు

సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం