కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌లో సంక్షోభాన్ని నివారించేందుకు పీసీబీ వరుసగా నియామకాలు చేపడుతోంది. ఇప్పటికే కొత్త కెప్టెన్లను నియమించిన పీసీబీ.. తాజాగా మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్‌కు టీమ్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ పదవితో పాటు హఫీజ్ కోచ్‌గా కూడా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్లకు సంబంధించి కొత్త కోచింగ్ సిబ్బందిని త్వరలోనే నియమించనున్నారు.
యంగ్‌స్టర్స్‌తో కూడిన పాక్ టీమ్‌ను తీర్చిదిద్దే బాధ్యత తనపై పెట్టినందుకు చాలా గర్వంగా ఉందని హఫీజ్ సంతోషం వ్యక్తం చేశాడు. హఫీజ్ గతేడాది జనవరిలో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు బాబర్ ఆజమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నందుకు పాక్ టీమ్ రెండుగా విడిపోయిందని సమాచారం.