
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, మానవ హక్కుల కోసం కృషి చేయడంతో ఆయనను ఈ అవార్డుకు నామినేట్ చేశారు. నార్వేకు చెందిన పొలిటికల్ పార్టీ అనుబంధ సంస్థ పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ (పీడబ్ల్యూఏ) సభ్యులు ఈ విషయాన్ని ప్రకటించారు.
‘‘నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసే హక్కు ఉన్న వ్యక్తితో మేం పొత్తు పెట్టుకున్నాం. పాకిస్తాన్ లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయడంతో ఇమ్రాన్ ఖాన్ ను ఈ అవార్డుకు నామినేట్ చేశాం” అని పేర్కొంది. దక్షిణాసియాలో శాంతిని ప్రోత్సహించడంతో 2019లోను ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.