కోర్టు ఎదుట హాజరైన పాక్ మాజీ ప్రధాని

కోర్టు ఎదుట హాజరైన పాక్ మాజీ ప్రధాని
  • పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కామెంట్​
  • మనీల్యాండరింగ్ కేసులో స్పెషల్ కోర్టు ఎదుట హాజరు 

లాహోర్‌‌: తనపై నమోదైన రూ.624 కోట్ల (16 బిలియన్ల పాకిస్తాన్ రూపాయలు) మనీల్యాండరింగ్ కేసులో స్పెషల్ కోర్టు ఎదుట పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సాక్ష్యం చెప్పారు. గతంలో పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా ఉన్నప్పుడు తాను జీతం కూడా తీసుకోలేదని, తానొక ఫూల్‌‌ని అని అన్నారు. కేసు విచారణ సందర్భంగా మాట్లాడిన షరీఫ్.. ‘‘12.5 ఏండ్లలో ప్రభుత్వం నుంచి నేనేమీ తీసుకోలేదు. కానీ నేను మనీ ల్యాండరింగ్ చేసినట్లు ఆరోపించారు. దేవుడు నన్ను ఈ దేశానికి ప్రధానిని చేశారు. నేనొక మజ్నూ(ఫూల్‌‌)ను. నేను నా చట్టపరమైన హక్కు, జీతం, బెనిఫిట్స్ తీసుకోలేదు” అని  చెప్పుకొచ్చారు. సీఎంగా ఉన్నప్పుడు చక్కెర ఎగుమతులపై పరిమితి విధించానని,  దీంతో తన కుటుంబం 2 బిలియన్ల పాకిస్తాన్ రూపాయలు నష్టపోయిందన్నారు. 


షెహబాజ్​పై కేసు ఇదీ..
షెహబాజ్, ఆయన కొడుకులు హమ్జా, సులేమాన్‌‌పై అవినీతి నిరోధక చట్టం, మనీ ల్యాండరింగ్ వ్యతిరేక చట్టంలోని పలు సెక్షన్ల కింద 2020 నవంబర్‌‌‌‌లో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్‌‌ఐఏ) కేసులు పెట్టింది. హమ్జా ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ సీఎం. సులేమాన్​ బ్రిటన్‌‌లో ఉన్నారు. షెహబాజ్ ఫ్యామిలీకి సంబంధించిన 28 బినామీ అకౌంట్లను గుర్తించామని, 2008 నుంచి 2018 దాకా రూ.582 కోట్ల మనీ ల్యాండరింగ్ చేశారని ఎఫ్‌‌ఐఏ చెప్పింది.

 

ఇవి కూడా చదవండి

అసైన్డ్ భూములను గుంజుకున్నరు..ఉనికిచెర్లలో 118 ఎకరాలు తీసుకున్న ‘కుడా’

పార్టీలకతీతంగా రాజీనామాలకు సర్పంచులు రెడీ

దివ్యాంగుడ్ని విమానం ఎక్కించుకోని ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5లక్షల జరిమానా