భూపతిరావు పేదల నాయకుడు

భద్రాచలం : సీపీఐ సీనియర్​ నేత, పాలేరు మాజీ ఎమ్మెల్యే భీంపాక భూపతిరావు(86) సోమవారం భద్రాచలంలోని తన స్వగృహంలో చనిపోయారు.  కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1983లో ఆయన సీపీఐ నుంచి  ఖమ్మం జిల్లా పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నాదెండ్ల భాస్కర్​ రావు వివాదం వల్ల ​ ప్రభుత్వం రద్దు కావడంతో ఆయన కొద్ది కాలమే ఎమ్మెల్యేగా ఉన్నారు. భూపతిరావుకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయన కుమారుడు భీంపాక నగేశ్​  ఇటీవలే హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

ఆయన కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొని, జైలు జీవితం కూడా అనుభవించారు. నిరాడంబరంగా ఉన్న ఆయన ఎమ్మెల్యేగా తనకొచ్చే  గౌరవ వేతనాన్ని పార్టీకే ఇచ్చేవారు. గన్​మెన్​లను, హైదరాబాదులో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. భూపతిరావు పేదల నాయకుడని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంతాపం ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం భద్రాచలంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.