బీఆర్‌‌ఎస్ కు మాజీ పొలి టీషియన్లే దిక్కు

హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు పెట్టిన బీఆర్‌‌ఎస్ పార్టీకి మాజీ పొలి టీషియన్లే దిక్కవుతున్నారు. యాక్టివ్ పొలిటీషియ న్లు ఆ పార్టీ వైపు చూడడం లేదు. దీంతో, గతంలో పెద్ద పదవులు చేపట్టిన లీడర్లపై కేసీఆర్ ఫోకస్ చేసినట్టు కనిపిస్తున్నది. వారికే బీఆర్‌‌ఎస్‌ రాష్ట్ర శాఖల బాధ్యతలు కట్టబెడుతున్నారు. తాజాగా ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌‌ గమాంగ్‌ను చేర్చుకున్నారు. 79 ఏండ్ల ఈ సీనియర్ నేత1999లో పది నెలలు ఒడిశా సీఎంగా పనిచేశారు. 43 ఏండ్లు కాంగ్రెస్‌లో ఉన్న గమాంగ్‌.. పార్టీ తనను పట్టించుకోవడం లేదని 2015లో బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ నుంచి బీఆర్‌‌ఎస్​లోకి వచ్చారు. 2004 తర్వాత ఆయన పోటీ చేసిన ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. గుజరాత్‌లోనూ బీఆర్‌‌ఎస్‌ను విస్తరిస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. గత సెప్టెంబర్‌‌లో ఆ రాష్ట్ర మాజీ సీఎం శంకర్‌‌ సింగ్ వాఘేలా హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌‌ను కలిశారు. బీఆర్‌‌ఎస్‌లో చేరికపై వారి మధ్య చర్చలు జరిగాయని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. 82 ఏండ్ల వాఘేలా 1996–--97లో ఏడాది పాటు గుజరాత్‌ సీఎంగా  పనిచేశారు. జనతా పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీల్లోనూ పనిచేశారు. సొంతగా 3 పార్టీలు పెట్టి, వాటిని ఇతర పార్టీల్లో విలీనం చేశారు. ఇప్పుడు బీఆర్‌‌ఎస్‌ వైపు చూస్తున్నారు.

ఏపీలోనూ అదే పరిస్థితి

బీఆర్‌‌ఎస్ ఏపీ ప్రెసిడెంట్​గా బాధ్యతలు చేపట్టిన తోట చంద్రశేఖర్‌‌ కూడా ఇప్పటికే 3 పార్టీలు మారా రు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఉద్యోగానికి 2008లో రాజీనామా చేసిన చంద్రశేఖర్‌‌.. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు ఎంపీగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2014 ఎన్నికల నాటికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఏలూరు ఎంపీగా పోటీ చేసి లక్ష ఓట్లకు పైగా తేడాతో ఓటమిని మూటగట్టుకున్నారు. 2019 నాటికి జనసేనలో చేరి గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మూడోసారి కూడా జనాలు ఆయనను ఆదరించకపోవడంతో, మూడోస్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓటమి తర్వాత అడపా దడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రశేఖర్‌.. ఇటీవల బీఆర్‌‌ఎస్ తీర్థం పుచ్చుకుని, ఏపీ బీఆర్​ఎస్​ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన బీఆర్​ఎస్​లో చేరి సుమారు నెల రోజులు కావొస్తున్నా ఏపీలో ఇంకా బీఆర్‌‌ఎస్ యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వలేదు.