కోల్‌బెల్ట్/కుంటాల, వెలుగు: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం జయంతి వేడుకలను మంగళవారం మందమర్రిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మనోవికాస్మానసిక దివ్యాంగుల స్కూల్లో పిల్లలతో కలిసి కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అబ్దుల్‌కలాం దేశ రక్షణ రంగం దిశను మార్చి క్షిపణి పితామహుడయ్యారని, అంతరిక్ష పరిశోధనలతో భారత్‌ను ప్రపంచం స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు.
యువతకు స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్ కలాం ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మహంత్ అర్జున్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో లీడర్లు కొలిపాక సదానందం, వేణు, ఓరుగంటి సురేందర్, మహంత్ కృష్ణ బాబు, శ్రీరామోజు సాయితేజ, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్ కలాం జయంతిని కుంటాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఫొటోలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవలను వక్తలు కొనియా డారు. యూత్ నాయకులు జక్కు ల గజేందర్, పవన్, కాశీరాం గజేందర్, యువజన సంఘాల సభ్యులుపాల్గొన్నారు.